Monday, August 15, 2022
Monday, August 15, 2022

త్వరలో మిగిలిన పోర్టులు ప్రారంభిస్తా.. : సీఎం జగన్‌

రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు అదనంగా..త్వరలో మరో నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభిస్తామని సీఎం జగన్‌ వెల్లడిరచారు. రామాయపట్నం పోర్టు భూమిపూజ చేసిన సీఎం జగన్‌.. ఈ పోర్టు రావటం ద్వారా ఆర్థికంగా యాక్టివిటీ పెరుగుతుందన్నారు. రూ 3740 కోట్లతో సిద్దం చేస్తున్న ఈ పోర్టు ద్వారా మూడు నుంచి నాలుగు వేల మందికి ఉపాధి అకవాశం దొరుకుతుందన్నారు. పరోక్షంగా చాలా మంది లబ్ది జరుగుతుందని వివరించారు. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. పోర్టులో 75 శాతం స్థానికులే ఉద్యోగాలని మరోమారు వేదిక నుంచి స్పష్టం చేసిన సీఎం జగన్‌.. ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు, నాలుగు పోర్టుల పనులు వేగవంతం చేశామని అన్నారు. త్వరలోనే మిగతా వాటికి భూమి పూజ చేస్తామని సీఎం జగన్‌ వెల్లడిరచారు. అధికారంలో ఉన్న అయిదేళ్లు ఏమీ చేయకుండా.. సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి టెంకాయ కొట్టి శంకుస్థాపన అని చంద్రబాబు ప్రకటించుకున్నారని సీఎం జగన్‌ దుయ్య బట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గత ప్రభుత్వం పోర్టుకు శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెట్టిందన్నారు.
గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఇదే తేడా
భూ సేకరణ, డీపీఆర్‌ లేకుండానే శంకుస్థాపన హడావిడి చేసిందని, కానీ, తమ ప్రభుత్వం అన్ని క్లియరెన్స్‌లతో పక్కాగా ముందుకు సాగుతోందని.. ప్రజలు ఇది గమనించాలని సీఎం జగన్‌ కోరారు. మరో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు కూడా నిర్మించబోతున్నామని వెల్లడిరచారు. ఏపీలో ప్రతీ యాభై కిలోమీటర్లకు ఓ పోర్టు.. లేదా ఓ ఫిషింగ్‌ హార్బర్‌ కనిపించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు ప్రకటించారు. కొత్త పోర్టులు ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుతాయన్నారు. పోర్టుకు కావాల్సిన భూసేకరణ పనులు కూడా దాదాపు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు.
మద్దతుగా నిలవండి
రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయన్నారు. పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్‌ కూడా తీసుకు వస్తామని సీఎం ప్రకటించారు. పోర్టుకు అనుసంధానంగా బైపాస్‌ రోడ్డుల నిర్మాణం చేపడతామన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన చేసి గత ప్రభుత్వంలోని పెద్దలు మోసం చేసారని..రైతులు, మహిళలను సైతం రుణ మాఫీ పేరుతో మోసం చేసారంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో మరింత వేగంగా అడుగులు వేస్తమన్నారు. తాము నిబద్దతతో చేస్తున్న పాలనకు మద్దతుగా నివాలని సీఎం జగన్‌ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img