Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

థర్డ్‌వేవ్‌.. అక్టోబర్‌లో పీక్‌ స్టేజ్‌కు..

పిల్లల పైనా ప్రభావం : హోంశాఖ
కరోనా థర్డ్‌వేవ్‌ అక్టోబర్‌లో పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దలతోపాటు పిల్లలపైనా ఇది ప్రభావం చూపనుందని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కరోనా థర్డ్‌ వేవ్‌కు సంబంధించి కీలక అంచనాలు, సూచనలు చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయా(పీఎంవో)నికి నివేదికను సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్‌ (చిన్న పిల్లల వైద్యం) వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన నివేదికలో తెలిపింది.వైరస్‌ వల్ల పిల్లలపై మరీ ఎక్కువ ప్రభావం పడకపోయినా.. వాళ్లు ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కమిటీ తెలిపింది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, దివ్యాంగులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img