Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తోంది : ఐఎంఏ


కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హెచ్చరించింది. కరోనా థర్డ్‌వేవ్‌ తప్పదని, కరోనా నిబంధనల అమలులో అలసత్వం పనికిరాదని, రక్షణాత్మక వైఖరిని విడనాడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.ఇటీవల దేశంలో పలు చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం, ఈ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంపై ఐఎంఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఏం జరిగిందో మనకు తెలుసు. గతంలో మహమ్మారులను చూసినా తెలుస్తుందని పేర్కొంది. మతమరమైన కార్యక్రమాలు, తీర్థయాత్రలు అవసరమే.. అయితే వీటిని మరి కొన్ని నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఇటువంటి వాటిని అనుమతించి, టీకాలు తీసుకోని వారికి ఈ కార్యక్రమాల్లో పూర్తి స్వేఛ్చ ఇస్తే..వారు సూపర్‌ స్ప్రెడర్లుగా మారవచ్చని ఓ ప్రకటనలో హెచ్చరించింది. . కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌ ద్వారా ముప్పు ప్రభావాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని చెప్పింది. వచ్చే రెండు, మూడు నెలలపాటు ఎలాంటి అలసత్వం లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img