Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

దిల్లీలో బీజేపీ గెలిస్తే…రాజకీయాలకు దూరం

కేజ్రీవాల్‌ సవాల్‌
దిల్లీ: మున్సిపల్‌ ఎన్నికలను వాయిదావేయడంపై ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను సరైన సమయంలోనే నిర్వహించి, వాటిలో గెలిస్తే ఆమ్‌ఆద్మీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్‌ విసిరారు. ప్రపంచంలోనే తమది పెద్ద పార్టీ అని బీజేపీ వారు పదే పదే చెప్పుకుంటారని, కానీ చిన్న పార్టీలకు, చిన్న ఎలక్షన్లకు వణికిపోతారని కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. ‘దిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయడమంటే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టి ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో ఎంతో కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధులను అవమానించడమే. భయం, ఓడిపోతామన్న నిస్పృహతో ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదావేస్తారేమో’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్‌ సర్కారుకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ కానున్నది. కార్పొరేషన్ల విలీనానికి మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై దిల్లీకి ఒక్కరే మేయర్‌ ఉండనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్‌ కార్పొరేషన్లు కాకుండా ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు కానున్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img