Monday, December 5, 2022
Monday, December 5, 2022

దూసుకొస్తున్న సిత్రంగ్‌ తుపాను

ఏ వైపు వెళ్తుందో తెలియడం లేదంటున్న వాతావరణ శాఖ
తీర ప్రాంతాల అప్రమత్తం

సముద్ర తీర ప్రాంతాలను సిత్రంగ్‌ తుపాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈనెల 22కి అల్పపీడనంగా, 23 నాటికి తుపానుగా మారి తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా ఒడిశా, బెంగాల్‌ తో పాటు ఆంధ్రప్రదేశ్‌ లోని తీర ప్రాంతాలకు భారీ వర్షం ముప్పు ఉంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్న తుపాను పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.
ఈ అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉన్నప్పటికీ దాని తీవ్రత, మార్గంపై అంచనా వేయడం కష్టంగా ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మ్రుతుంజయ్‌ మహపాత్ర తెలిపారు. మరోపక్క, పలు కోస్తా జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించారు. సూచనను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం తమ ఉద్యోగుల సెలవులను అక్టోబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 25 వరకు రద్దు చేసింది. సిత్రంగ్‌ కారణంగా ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కరిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తుపాను మొదలైతే పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img