Monday, October 3, 2022
Monday, October 3, 2022

దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 10,725 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. తాజాగా 13,084 మంది బాధితులు కోలుకోగా.. వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 5,27,488 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 94,047 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 210.82కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img