Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దేశంలో కొత్తగా 121 కరోనా కేసులు.. ఒకరు మృతి

దేశంలో కొత్తగా 121 కరోనా కేసులు నమోదవ్వగా, ఈ మహమ్మారి బారినపడి ఒకరు మృతి చెందారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,69,568మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,215కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,319 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,722కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడిరచింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.14 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img