Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

దేశంలో కొత్తగా 16,167 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 2.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 16,167 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి చేరాయి. ఇందులో 4,34,99,659 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,730 మంది మృతిచెందారు. మరో 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మరో 41 మంది కరోనాకు బలవగా, 15,549 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.50 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 206.56 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img