Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దేశంలో కొత్తగా 171 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు అదుపులోనే ఉంది. ఒక రోజు కాస్త పెరిగితే మరో రోజు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,80,386 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 2,342 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉందని, ఇక తాజాగా ఒక్కరు కూడా మరణించలేదు. దీంతో మృతుల సంఖ్య 5,30,722 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 148 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img