Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

దేశంలో కొత్తగా 176 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,678,822కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,670 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,707కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడిరచింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.10 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img