Friday, December 1, 2023
Friday, December 1, 2023

దేశంలో కొత్తగా 20,799 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్‌ కేసులను నమోదు కాగా, 180 మంది మరణించారు. తాజా కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,34,702 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,997 కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 26,718 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,31,21,247కి పెరిగినట్లు కేంద్రం వెల్లడిరచింది. ప్రస్తుతం దేశంలో 2,64,458 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది.. దేశంలో ఇప్పటి వరకు 90.79 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.నిన్న దేశవ్యాప్తంగా 9,91,676 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడిరచింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,42,52,400 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img