Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

దేశంలో కొత్తగా 2527 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వెయ్యి లోపే కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేలకు చేరువ అవుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచిన తాజా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,54,952కు చేరాయి. ఇందులో 15,079 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,17,124 మంది డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో 1656 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 33 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,149కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో పాటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా.. రికవరీరేటు 98.75 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,46,72,536 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img