Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

దేశంలో కొత్తగా 26,041 కరోనా కేసులు


దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, కరోనా బారినపడి 4,47,194 మంది బాధితులు బలయ్యారు. ప్రస్తుతం 2,99,620 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో కొత్తగా 276 మంది మృతి చెందగా.. 29,621 మంది బాధితులు కోలుకున్నారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక వాటా కేరళదేనని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 15,951 కేసులు నమోదవగా, 165 మంది మృతిచెందారని వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,18,362 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు 86,01,59,011 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img