దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడోరోజు కొత్త కేసులు మూడు లక్షలకు దిగువనే నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య తగ్గడంతో రోజువారీ కేసులు తగ్గినప్పటికీ పాజిటివిటీ రేటు మాత్రం అమాంతం పెరిగి 20 శాతానికి సమీపించింది. . గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,385 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా…573 మంది మృతి చెందారు. దాదాపు 3,06,357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివీటీ రేటు 19.59 శాతంగా నమోదు అయ్యింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,63,84,39,207గా ఉంది. ఇక నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 22 లక్షల మందే టీకా వేయించుకున్నారు. కేంద్రం ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 163 కోట్ల మార్కు దాటింది.