Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

దేశంలో కొత్తగా 3,205 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మరో 31 మంది కరోనా బారిన పడి మరణించారు. అదే సమయంలో మొత్తం 2802 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 5,23,920 మంది మహమ్మారి బారిన పడి మరణించారు.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతమని పేర్కొన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని, మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img