Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు


దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 19,98,715 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..38,079 మంది కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో దేశంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829కి చేరుకుంది. కరోనాతో నిన్న 560 మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. కొత్తగా 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు.దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 39.53 కోట్ల మందికి టీకా పంపిణీ అందించడం జరిగింది. నిన్న ఒక్కరోజే 42,12,557 డోసులు అందించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img