Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

దేశంలో కొత్తగా 4 వేలపైగా కరోనా కేసులు

దేశంలో కొత్తగా 4 వేలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం, సోమవారం నాడు దేశవ్యాప్తంగా మొత్తం 4,129 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,45,72,243కు చేరింది. అలాగే ఇరవై మంది కరోనా కారణంగా కన్నుమూసినట్లు అధికారులు వెల్లడిరచారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,28,530కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.10 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.72గా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img