Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

దేశంలో కొత్తగా 40వేల పైనే కరోనా కేసులు


దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,76,324 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,763 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 29,836 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 31 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 75 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img