Friday, December 2, 2022
Friday, December 2, 2022

దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,654 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,14,84,605కి చేరింది. ఇందులో 3,99,436 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 41,678 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రికవరీల సంఖ్య 3,06,63,147కి చేరింది. ఇక కరోనాతో గడచిన 24 గంటల్లో 640 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,22,022 చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటిదాకా 44,61,56,659 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img