Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

దేశంలో కొత్తగా 5,910 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొద్దిరోజులుగా కేసులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కొత్త కేసులు పదివేలకు దిగువనే నమోదవుతున్నాయి. కొత్తగా 5,910 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7,034 మంది కోలుకోగా, 9 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక దేశవ్యాప్తంగా 213.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img