Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

దేశంలో కొత్తగా 8వేలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,586 రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 9,650 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా 48 మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,43,57,546కు చేరింది. ఇందులో 4,37,33,624 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 527,416 ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 210.31కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img