Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దేశంలో కొత్తగా 8,318 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,63,749కి చేరాయి. ఇందులో 1,07,019 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,67,933 మంది వైరస్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,967 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 465 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 4,677 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 388 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్పటివరకు 121.06 కోట్ల డోసులను పంపిణీ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img