Monday, June 5, 2023
Monday, June 5, 2023

దేశంలో కొత్తగా 918 కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే నిన్న పెరిగిన కరోనా కేసులుౌ ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 918 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,96,338 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,350 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.99 శాతంగా ఉంది. కరోనాతో నలుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,806 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 479 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీ ల సంఖ్య 4,41,59,182 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img