Monday, March 20, 2023
Monday, March 20, 2023

దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

పది శాతం దిగువకు పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య రెండు లక్షలకు దిగువగానే నమోదైంది. 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స నుంచి కోలుకుని 2,81,109 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 16,21,603కు చేరగా.. రోజువారీ పాజిటివీటి రేటు 9.26 శాతంగా నమోదైంది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 1733 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో గతంలో నమోదైన మరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకుంటుండంతో కేంద్రం గణాంకాలను ఎక్కువగా చూపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. 3,95,11,307 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఈ మహమ్మారి కారణంగా 4,97,975 మంది ఇప్పటివరకు మరణించారు.కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 167.29 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img