దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,102 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 278 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,64,522 (0.38%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,28,67,031 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,622 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడిరచింది.కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 31,377 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,21,89,887కి చేరింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,76,19,39,020 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.