Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

దేశంలో తొలి కరోనా పేషెంట్‌కు మరోసారి పాజిటివ్‌


దేశంలో కరోనా వైరస్‌ వెలుగు చూసి ఏడాదిన్నర దాటినా ఆ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒకసారి వైరస్‌ సోకిన కొందరికి రీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తాజాగా దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌ మరోసారి కరోనా బారినపడ్డారు. కేరళలో త్రిస్సూర్‌కు చెందిన వైద్య విద్యార్థిని దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కావడం తెలిసిందే. 20 ఏళ్ల ఆ వైద్య విద్యార్థిని చైనాలోని వూహాన్‌లో ఓ మెడికల్‌ యూనివర్సిటీలో చదివేవారు. కరోనా సంక్షోభం కారణంగా గతేడాది జనవరిలో స్నేహితులతో పాటూ ఆమె భారత్‌కు తిరిగొచ్చారు. ఈ క్రమంలో ఆమె దేశంలో అడుగు పెట్టాక పాజిటివ్‌ అని తేలింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు త్రిసూర్‌లోని ఆసుప్రతిలో క్వారెంటైన్‌లో ఉన్నారు. మూడు వారాల తర్వాత కరోనా బారి నుంచి ఆమె కోరుకున్నారు. తాజాగా ఆ యువతి మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు వెల్లడిరచారు. ఆమెకు ఎలాంటి కరోనా రోగలక్షణాలేవీ లేవని కూడా వారు తెలిపారు. దిల్లీకి వెళ్లాలనుకుంటున్న సదరు విద్యార్థిని ఇటీవల కరోనా నిర్థారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా రెండోసారి కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడే కేసులు కూడా పెరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img