Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖంపట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా 1,280 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ కారణంగా 58 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 12,054కు పడిపోయాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,29,839కు చేరింది. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,416 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 1,208 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,96,369 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,84,87,33,081 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశ వ్యాప్తంగా నిన్న 4,66,332 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.15 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img