Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో కరోనాతోపాటు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3,071 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢల్లీిలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 128, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్నటితో పోల్చుకుంటే.. కొత్తగా 64 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఢల్లీిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ బారి నుంచి 1203 మంది కోలుకున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img