Monday, August 8, 2022
Monday, August 8, 2022

దేశంలో మంకీపాక్స్‌ కలకలం

యూపీలో ఐదేళ్ల చిన్నారి నమూనాల సేకరణ
కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకముందే మరో వైరస్‌ కలవరపెడుతోంది. అమెరికా సహా అనేక దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. మన దేశంలో ఇప్పటివరకూ ఈ వైరస్‌ కేసులు నమోదుకానప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్నారికి మంకీపాక్స్‌ తరహా లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఘజియాబాద్‌కు చెందిన ఓ ఐదేండ్ల బాలిక మంకీపాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్నది. దీంతో అధికారులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తన ఒంటిపై దురద, దద్దుర్లు వస్తున్నాయని వైద్యులను చిన్నారి సంప్రదించిందని ఘజియాబాద్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కాగా, ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేవని చెప్పారు. అదేవిధంగా ఆమెకు దగ్గరి సంబంధికులు ఎవరూ గత నెలరోజుల్లో విదేశాల్లో పర్యటించలేదని వెల్లడిరచారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆమె నుంచి నమూనాలు సేకరించామన్నారు. ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీపాక్స్‌ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే ఫ్రాన్స్‌లో 51 మందికి పాజిటివ్‌ వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. అయితే మంకీపాక్స్‌ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img