Monday, January 30, 2023
Monday, January 30, 2023

దేశంలో మరోమారు పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కొత్తకేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా మరోమారు కరోనా కేసులు పెరిగాయి.నిన్నటికంటే 12 శాతం అధికంగా కరోనా కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసలతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది. ఇందులో కరోనా నుంచి కోలుకున్నవారు 3,18,51,802 మంది ఉన్నారు. కరోనాకు 4,37,370 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3,59,775 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 509 మంది మరణించగా, మరో 46,759 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.కాగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 62,29,89,134 డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గత 24 గంటల్లో కోటీ 3లక్షల 35వేల 290 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img