Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. శుక్రవారం 3,545 కేసులు నమోదవగా, కొత్తగా 3,805 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఢల్లీిలో 1,656 కేసులు నమోదు కాగా ముంబైలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో దాదాపు 400 కేసులు వచ్చాయి. దేశంలో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 22 మంది కరోనా కారణంగా మృతి చెందారు. వీటిలో 20 మరణాలు కేరళలో నమోదయ్యాయి. కరోనా నుంచి నిన్న 3,168 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 వేలను దాటింది. యాక్టివ్‌ కేసులు 20,303కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,90,00,94,982 డోసుల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 17,49,063 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img