Friday, December 2, 2022
Friday, December 2, 2022

దేశంలో మళ్లీ పెరిగిన రోజువారీ కరోనా కేసులు

కొత్తగా 18,313 పాజిటివ్‌ కేసులు
న్యూఢల్లీి: దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ముందురోజు కంటే నాలువేల మేర అదనంగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 14,830 కేసులు నమోదవగా, తాజాగా అవి 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 57 మంది మృతిచెందగా, 20,742 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 202.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img