కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలకు చాపకింద నీరులా విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందగా, మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడిరచింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢల్లీిలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, ఉత్తరప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174 కేసులు నమోదవగా.. మంగళవారం వరకు 200కు పెరిగాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢల్లీిలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్లో 18, ఉత్తరప్రదేశ్, ఏపీ, బెంగాల్లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ దాదాపు వంద దేశాలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి విపరీతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బ్రిటన్లో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు అక్కడ 40 వేల కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు 73శాతానికి పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగుతుండటంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. కొన్ని దేశాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలుచేస్తున్నాయి.