దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి.అయితే శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 3,37,704 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 488 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారంతో పోల్చుకుంటే.. శుక్రవారం కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది.పాజిటివిటీ రేటు 17.22% శాతం గా ఉంది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,42,676 మంది బాధితులు కోలుకున్నారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38,90,3748కి చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 4,88,884 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 3.6 కోట్ల మంది కోలుకోగా రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3.69 శాతం పెరిగింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 67 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 161 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది.15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో నాలుగు కోట్ల మందికి పైగా టీకా తొలి డోసు స్వీకరించారు. 74.5 లక్షల ప్రికాషనరీ డోసులు పంపిణీ అయ్యాయి.