Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,962 పాజిటివ్‌ కేసులు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 4వేలకు పైగా నమోదైన కొత్త కేసులు తాజాగా స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 4041 మంది కరోనా బారినపడగా, తాజాగా ఆ సంఖ్య 3,962కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,31,72,547కు చేరాయి. ఇందులో 4,26,25,454 మంది బాధితులు కోలుకోగా, 22,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,677 మంది కరోనాకు బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 2697 మంది డిశ్చార్జీ అయ్యారని, 26 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.05 శాతానికి పెరిగిందని, 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉందని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,93,96,47,071 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో శుక్రవారం ఒక్కరోజే 11,67,037 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img