Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

దేశంలో కొత్తగా 15 వేలకు పైగా కరోనా కేసులు..25 మరణాలు

స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా 15,528 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. ముందురోజు 50కి పైగా సంభవించిన మరణాలు..24 గంటల వ్యవధిలో 25కి తగ్గాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.32 శాతానికి తగ్గినట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 200.33 కోట్ల డోసుల కరోనా టీకాల పంపిణీ జరిగినట్లు అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img