Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

కొవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా రెండు వేలకు పైగా నమోదవుతున్న కొత్త కేసులు..తాజాగా మూడువేలకు సమీపించాయి. దిల్లీలో వైరస్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడిరచిన గణాంకాల ప్రకారం, 5.05 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా 2,927 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగిందని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,88,19,40,971 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం ఒక్కరోజే 21,97,082 మందికి వ్యాక్సినేషన్‌ చేశామంది. దేశంలో కొత్తకేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ తీరును సమీక్షించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img