దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు 83కి చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 32 మందికి ఈ వేరియంట్ సోకింది. ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 7,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే ఆరుశాతం మేర కేసులు తగ్గాయి. తాజా కేసులతో మొత్తం బాధితులు 3,47,26,049కి పెరిగారు. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,76,869 మంది మహమ్మారి వల్ల మరణించారు. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7886 మంది కోలుకోగా, 391 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కాగా, గురువారం రాత్రి వరకు 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది.