Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

దేశంలో 8 వేలు దాటిన కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img