Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

దేశంలో 86 వేలకు తగ్గిన క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు పదివేల దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల కేసులు తగ్గుతూ 86 వేలకు చేరాయి. దేశంలో కొత్తగా 9,560 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.19 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img