Friday, February 3, 2023
Friday, February 3, 2023

నవాబ్‌ మాలిక్‌ ఆస్తుల జప్తు

న్యూదిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌కు చెందిన వివిధ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడిరచింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద మహ్మద్‌ నవాబ్‌ మహమ్మద్‌ ఇస్లాం మాలిక్‌ అలియాస్‌ నవాబ్‌ మాలిక్‌, అతని కుటుంబ సభ్యులు… సాలిడస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను జప్తు చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. జప్తు కాబడిన ఆస్తులలో ముంబై సబర్బన్‌ కుర్లా (పశ్చిమ)లోని గోవాలా కాంపౌండ్‌, కమర్షియల్‌ యూనిట్‌, ఉస్మానాబాద్‌ జిల్లాలో ఉన్న 147.79 ఎకరాల వ్యవసాయ భూమి, కుర్లా (పశ్చిమ)లో మూడు ఫ్లాట్లు, బాంద్రా (పశ్చిమ)లో రెండు నివాసిత ఫ్లాట్లు ఉన్నట్లు ఈడీ వివరించింది. కాగా జైలు నుండి తక్షణమే విడుదల చేయాలని కోరుతూ 62 ఏళ్ల మాలిక్‌ చేసిన పిటిషన్‌ విచారించే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. గత ఫిబ్రవరిలో ముంబైలో మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img