Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నాడు, నేడు కార్యక్రమం ప్రకటనలకే పరిమితమా?

630 మంది విద్యార్థులకు 4 మరుగుదొడ్లేనా: జగన్‌కు రామకృష్ణ లేఖ
చింతలపూడి ఎస్సీ గురుకుల పాఠశాల గురించి జగన్‌కు లేఖ

ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ గురుకుల పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఒకే గోడౌన్‌ లో మగ్గుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ కు బిల్లులు చెల్లించకపోవడంతో భవననిర్మాణం నిలిచి పోయిందని విమర్శించారు. 630 మంది విద్యార్థులకు కేవలం 4 మరుగుదొడ్లే ఉన్నాయని మండిపడ్డారు. దళితులు అంటే మీకు అంత చులకనా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విద్యారంగంలో నాడు, నేడు అనేది కేవలం ప్రచారానికి, ప్రకటనలకే పరిమితమా? అని పశ్నించారు. మీరు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ చింతలపూడి గురుకుల పాఠశాలను సందర్శించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img