Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు

10గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల

కర్నూలు : కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురు స్తున్న భారీ వర్షాల వలన శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. వారం రోజులుగా వచ్చి చేరుతున్న నీటితో ప్రాజెక్టు నిండుకుం డను తలపిస్తోంది. ప్రాజెక్టు నుండి బుధవారం సాయంత్రం రెండు గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు…గురువారం ఉదయం మొదట 6, తరువాత 7 గేట్లు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. తరువాత 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,75,680 క్యూసె క్కుల నీరు విడుదల చేశారు. ఎగువ జూరాల, సుంకేసుల నుండి 5,12,9 15 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నారు. మరో రెండురోజులు వరద ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img