విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతం భారీ ఎత్తున వరద నీరు శ్రీశైలం జలాశయం కు వచ్చి చేరు తుండటంతో జలాశయం నుంచి దిగువ సాగర్‌కు నీటి విడుదల చేశారు. గురువారం 10 గేట్‌లు 12 అడుగుల ఎత్తి దిగువ సాగర్‌కు, పోతిరెడ్డిపాడు, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా,4,04,722 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 3,09,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 884.50, జలాశయం నీటి సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.9197 టీఎంసీలు నిలువ ఉన్నాయి.