Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

నీళ్ల బాటిల్‌ రూ. 3000, ప్లేటు రైస్‌ రూ. 7,500


కాబుల్‌ విమానాశ్రయంలో దారుణ పరిస్థితులు
అప్ఘానిస్తాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడి పరిస్థితులు దారణంగా మారాయి. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో ప్రజలు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విమానాశ్రయం వద్ద తాగునీటిని, ఆహారాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు.నీళ్ల బాటిల్‌ 40 డాలర్లు(సుమారు రూ. 3వేలు), ఒక ప్లేట్‌ రైస్‌ 100 డాలర్లు (రూ.7,500)కు విక్రయిస్తున్నారు. మరో వైపు స్థానిక ఆఫ్ఘన్‌ కరెన్సీని విమానాశ్రయంలో తీసుకోవడం లేదు. కేవలం డాలర్లు మాత్రమే అనుమతి ఇస్తుండడంతో ఆఫ్ఘన్‌ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. ఆహారం కోసం అక్కడ పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద దాదాపు 50వేల మంది వరకు జనం ఉన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలోకి కొంత మందిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తుండడంతో వేలాది మంది వెలుపల నిరీక్షిస్తున్నారు. ఎలాగైనా తాలిబన్ల నుంచి బయటపడాలని కష్టాలకోర్చుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img