Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నేటి నుంచి పుదుచ్చేరిలో
సీపీఐ జాతీయ సమితి సమావేశాలు

పుదుచ్చేరి: సీపీఐ జాతీయ సమితి సమావేశాలు శనివారం నుంచి పుదుచ్చేరిలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి 28వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 150 మంది ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సీపీఐ జాతీయ సమితి కూలంకషంగా చర్చిస్తుంది. మోదీ సర్కారును గద్దె దించడానికిగాను ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అనుసరించాల్సిన మార్గాలపై నాయకులు చర్చిస్తారు. జాతీయ సమితి సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 26న గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ల పాత్రపై సెమినార్‌ నిర్వహిస్తారు. వామపక్ష పార్టీలు, భావసారూప్యత గల ఇతర రాజకీయ పార్టీల నాయకులు సెమినార్‌లో పాల్గొంటారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కోసం మరో సెమినార్‌ జరుగుతుంది. వీటితో పాటు జాతీయ రాజకీయాలు, మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ఈ విషయాలను సీపీఐ పుదుచ్చేరి శాఖ కార్యదర్శి ఏఎం సలీం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img