Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

నేడు పది ఫలితాలు

గ్రేడిరగ్‌తో మార్కుల జాబితాలు
వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకటించనున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ ఏడాది(జూన్‌2021)తో పాటు గత ఏడాది (మార్చి2020) పది పరీక్షా ఫలితాలను గ్రేడిరగ్‌ విధానంలో సబ్జెక్టుల వారీగా మార్కుల జాబితాను విడుదల చేస్తారు. వీటిని షషష.పంవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ నుంచి లేదా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా పొందవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా మార్చి2020 టెన్త్‌ పరీక్షలను నిర్వహించలేక పోయారు. దీంతో ఆ విద్యా సంవత్సరంలో పరీక్ష రుసుం చెల్లించిన వారందరినీ ప్రభుత్వం ఎలాంటి మార్కులు లేకుండా ఒకే విధంగా ఉత్తీర్ణులను చేసింది. జూన్‌2021 పరీక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనూ రెండో దశ కరోనా ఉధృతి పెరగడంతో వాటిని రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో విద్యా, ఉద్యోగ పరీక్షలకు విద్యార్థుల మార్కులను పరిగణలోకి తీసుకుండటంతో భవిష్యత్తులో విద్యార్థులకు సమస్య రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మార్కుల ఆధారంగా గ్రేడిరగ్‌ విధానంలో ఫలితాలు ఇవ్వాలని భావించింది. దీంతో పరీక్షల ఫలితాల వెల్లడికి ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. బృందం చేసిన సిఫార్సుల మేరకు జూన్‌2021 ఫలితాలను మార్కులు, గ్రేడ్‌ పాయింట్లతో వెల్లడిరచనుంది. ఇదే విధానంలో మార్చి`2020 పది విద్యార్థులకు కూడా తాజాగా ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img