Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీరం చేసిన ఏపీ సర్కార్‌.. రాహుల్‌ గాంధీ

పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రమ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ జోడో యాత్రను ఏపీలో ముగించుకొని కర్ణాటకలోనీ రాయచూరులో ప్రవేశిస్తున్న సందర్భంగా మాధవరం బ్రిడ్జిపై హాజరైన ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు.. ఏపీ ప్రజలు తన భారత్‌ జూడో యాత్రకు అపారమైన మద్దతు ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా మరపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యాత్ర సందర్భంగా విభిన్న సమూహాలతో కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన సమస్యలను వెలుగులోకి వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు- అమరావతిలో ఒకే రాజధానిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టు-బడి ఉన్నట్లు- పేర్కొన్నారు. భారతీయ ప్రజల ఆస్తిగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ యొక్క ప్రభుత్వ రంగ హోదాను కొనసాగించడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసిందన్నారు. ప్రజాస్వామ్య సంస్థలపై ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు- పేర్కొన్నారు. గత మూడు రోజులుగా రైతులు, యువత, మహిళలు, కార్మికులతో పరస్పరంగా మాట్లాడితే అనేక సమస్యలు వెలుగు చూసాయి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img