Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పార్లమెంటులో మళ్లీ అదే సీన్‌

ఉభయసభలు వాయిదా
ఫోన్ల హ్యాంకింగ్‌ వ్యవహారం, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ దద్దరిల్లింది.ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి గట్టిగట్టిగా నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్‌ ఛైర్‌, ట్రెజరీ బెంచ్‌లపైకి విసిరారు. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. విరామం తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడిరది.రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. విపక్షాల ఆందోళనలతో ఈ ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిరది. ుళ్లీ 12 గంటలకు సభ మొదలవగా.. విపక్ష ఎంపీలు పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img