Monday, January 30, 2023
Monday, January 30, 2023

‘పెగాసస్‌’ పై రక్షణ మంత్రిత్వశాఖ కీలక ప్రకటన

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న ‘పెగాసస్‌’ వ్యవహారంపై రక్షణ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఈ స్పైవేర్‌ తయారీదారైన ఎన్‌ఎస్‌ఓ సంస్థతో తాము ఎటువంటి లావాదేవీలు జరపలేదని సోమవారం రాజ్యసభలో స్పష్టమైన ప్రకటన చేసింది.పెగాసస్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓతో ప్రభుత్వం లావాదేవీలు జరిపిందా..? ఒకవేళ ఉంటే వివరాలు చెప్పాలని రాజసభ్య సభ్యుడు, సీపీఎం నేత వి.శివదాసన్‌ అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌భట్‌ ‘ఎస్‌ఎస్‌ఓ గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదు’ అని లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అయితే..ఈ విషయమై హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకుమునుపు..పెగాసస్‌ వ్యవహారంపై పార్లమెంట్‌ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img